Mon Jun 16 2025 12:13:03 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మళ్లీ మనదే అధికారం.. డోన్ట్ ఫియర్
మళ్లీ అధికారం వైసీపీదేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ట్వీట్ చేశారు

మళ్లీ అధికారం వైసీపీదేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ట్వీట్ చేశారు. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకు వెళుతుందని తెలిపారు.
ముఖ్య నేతలతో మాట్లాడుతూ...
విదేశీ పర్యటనలో ఉన్న జగన్ పార్టీ ముఖ్యలతో మాట్లాడారు. తాను ఇటీవల చెప్పిన నెంబర్ రాబోతోందని మరోసారి స్పష్టం చేశారు. జూన్ 1న వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నప్పటికీ జూన్ 4న వచ్చే ఎగ్జాట్ పోల్స్ మాత్రం తమవైపే అనుకూలంగా ఉంటాయని ధీమాగా చెప్పారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మహిళలు, వృద్ధులు పూర్తిగా తమవైపే ఉన్నారని ఆయన అన్నారు. వైసీపీ గెలుపు గ్యారంటీ అని, ఎవరూ భయపడాల్సిన పనిలేదంటూ ఆయన మరోసారి నేతలకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
Next Story