Mon Dec 15 2025 00:16:35 GMT+0000 (Coordinated Universal Time)
పోలవరం ఎత్తుపై అసలు నిజమిదే
సీడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు డ్యామ్ ఎత్తు ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు

సీడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు డ్యామ్ ఎత్తు ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై వస్తున్న అపోహలను ఎవరూ నమ్మొద్దని ఆయన కోరారు..ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 45.7 మీటర్లు ఎత్తు వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
సీడబ్ల్యూసీ సిఫారసు మేరకు...
సీడబ్ల్యూసీ సిఫారసు మేరకు తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తామన్న సీఎం జగన్, పోలవరం ప్రాజెక్టుపై ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయమై తాను ఇటీవల ప్రధానిని కలిసి చర్చించినట్లు ఆయన శాసనభలో సభ్యులకు ఆయన వివరించారు.
Next Story

