Sun Mar 22 2026 00:00:03 GMT+0530 (India Standard Time)
త్వరలోనే విశాఖ నుంచి పాలన
త్వరలో విశాఖ నుంచి తాను పరిపాలన సాగిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు

త్వరలో విశాఖ నుంచి తాను పరిపాలన సాగిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. అందమైన విశాఖపట్నం త్వరలోనే పరిపాలన రాజధాని కాబోతుందని ఆయన తెలిపారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో తొలిరోజు సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పరిపాలన రాజధానిగా...
విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని జగన్ తెలిపారు. త్వరలోనే తాను కూడా విశాఖ నుంచి పరిపాలన చేస్తున్నట్లు జగన్ ప్రకటించడం విశేషం. గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో జగన్ కీలక ప్రకటన చేశారు. దీంతో మరోసారి ఆయన పరిపాలన రాజధానిపై కీలక ప్రకటన చేసినట్లయింది.
Next Story

