Tue Mar 31 2026 06:04:30 GMT+0530 (India Standard Time)
పర్యాటకుల భద్రత కోసమే పోలీస్స్టేషన్లు
పర్యాటకుల భద్రత లక్ష్యంగానే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు

పర్యాటకుల భద్రత లక్ష్యంగానే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. 20 పర్యాటక ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా ఈ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ లోనూ ప్రత్యేకంగా బీచ్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
జీరో ఎఫ్ఐఆర్...
గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు శాఖలో సంస్కరణలను అమలు చేస్తున్నామని జగన్ తెలిపారు. పోలీస్ స్టేషన్లను వర్చువల్ విధానంలో జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీరో ఎఫ్ఐఆర్ ను అమలులోకి తెచ్చామని తెలిపారు. ఆలయాలు, బీచ్ ల వద్ద కూడా ప్రత్యేకంగా పర్యాటకుల కోసం ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Next Story

