Tue Jan 20 2026 22:16:36 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం అంటే ఇలా చేయాలి
వరదలు వచ్చిన వెంటనే తాను పర్యటిస్తే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు

వరదలు వచ్చిన వెంటనే తాను పర్యటిస్తే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్ అక్కడ వరద బాధితులతో మాట్లాడారు. ప్రజలకు మంచి జరగాలంటే అధికారులకు ఆదేశాలు జారీ చేసి పరుగులు పెట్టించాలన్నారు. అప్పుడే సహాయ కార్యక్రమాలు వేగంగా జరుగుతాయన్నారు. తాను వారం రోజుల తర్వాత వస్తానని, అందరూ తమకు సాయం అందిందని చెప్పాలని తాను అధికారులను ఆదేశించానన్నారు.
అందరికీ పరిహారం....
అధికారులకు సరైన వనరులు అందిస్తే వారు తమ పని తాము చేసుకుంటారని చెప్పారు. వారం రోజుల తర్వాత తాను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నానని తెలిపారు. ఏ ఒక్కరికీ సాయం అందకపోయినా అంగీకరించనని చెప్పారు. ముఖ్యమంత్రి అంటే ఆ విధంగా చేయాలని, వరదలప్పుడు వచ్చి డ్రామాలు చేయడం తనకు చేతకాదని జగన్ అన్నారు. డ్రామాలను పక్కన పెట్టి సాయం అందడంపైనే దృష్టి పెట్టామని, ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకోగలిగామని జగన్ ీఅన్నారు. వరదల సమయంలో తాను ఇక్కడికి వచ్చి ఉంటే అధికారులు తన చుట్టూ తిరిగే వారన్నారు. పంట, ఆస్తి నష్టం అంచనాలు పూర్తయిన వెంటనే పరిహారం చెల్లిస్తామని చెప్పారు. సీజన్ ముగియక ముందే అందరికీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని జగన్ తెలిపారు.
Next Story

