Sun Mar 15 2026 20:37:47 GMT+0530 (India Standard Time)
Ys Jagan : మరింత మెరుగైన పాలనను అందిస్తా : జగన్
ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన పాలన మరింతగా అందిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు

ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన పాలన మరింతగా అందిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆయన పోలింగ్ జరిగిన తీరుపై ట్వీట్ చేశారు. మండే ఎండలను సయితం లెక్క చేయకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన తనకు ఆశీస్సులు ఇచ్చేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారకి కృతజ్ఞతలు తెలిపారు.
గెలుపు కోసం..
వైసీపీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటి వరకూ సాగిన సుపరిపాలన మరింత మెరుగ్గా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు
Next Story

