Thu Mar 19 2026 15:17:58 GMT+0530 (India Standard Time)
గంగమ్మ గుడిలో జగన్ ప్రత్యేక పూజలు
ముఖ్యమంత్రి జగన్ తిరుపతి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతిలోని గంగమ్మ గుడిని దర్శించుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తిరుపతి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతిలోని గంగమ్మ గుడిని దర్శించుకున్నారు. గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు ఆశీర్చనాలు అందేచేశారు.
ఎలక్ట్రిక్ బస్సులను...
అనంతరం తిరుపతిలోని అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులను వైఎస్ జగన్ ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పలువురు ఘన స్వాగతం పలికారు. అలిపిరి నుంచి ఆయన బయలుదేరి తిరుమలకు వెళ్లారు.
Next Story

