Mon Mar 30 2026 13:52:15 GMT+0530 (India Standard Time)
మహా యజ్ఞంలో పాల్గొన్న జగన్
విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ మహా యజ్ఞంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ మహా యజ్ఞంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన జగన్ అనంతరం వివిధ పూజా కార్యక్రమాలల్లో పాల్గొన్నారు. మే 17వ తేదీ బుధవారం వరకు 6 రోజులపాటు ఈ మహాయజ్ఞం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రజలు శాంతియుత వాతావరణంలో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ దేవాదాయశాఖ ఈ యజ్ఞాన్ని జరుపుతుంది.
ఆరు రోజుల పాటు...
భక్తుల కోసం ప్రత్యేకంగా నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణతోపాటు రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతూ ప్రజలందరూ కల్యాణ సౌభాగ్యాలతో వర్థిల్లాలని కాంక్షిస్తూ దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. శుక్రవారం నుంచి అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఆరు రోజుల పాటు వరసగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Next Story

