Fri Apr 03 2026 09:09:28 GMT+0530 (India Standard Time)
రాజశ్యామల యాగంలో జగన్
విశాఖ శారదాపీఠంలో జరుగుతున్న రాజశ్యామల యాగంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.

విశాఖ శారదాపీఠంలో జరుగుతున్న రాజశ్యామల యాగంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. మూడు రోజుల నుంచి శారదాపీఠంలో రాజశ్యామల యాగం జరుగుతుంది. ఈరోజు శారదాపీఠానికి వచ్చిన జగన్ పీఠంలో జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శారదాపీఠానికి వచ్చిన జగన్ కు పీఠం నిర్వాహకులు స్వాగతం పలికారు.
జగన్ వెంట....
ముఖ్యమంత్రి జగన్ తో పాటు రాజశ్యామల యాగంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి పాల్గొన్నారు. ప్రత ఏడాది మాఘ మాసం పంచమి నుంచి దశమి వరకూ శారద పీఠం వార్షికోత్సవాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం ఐదు రోజుల పాటు శారదాపీఠం రాజశ్యామల యాగం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో స్వరూపానందేంద్ర స్వామి పాల్గొన్నారు. జగన్ శారదాపీఠానికి వస్తున్నారని తెలిసి ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున తరలి వచ్చారు.
Next Story

