Wed Apr 01 2026 01:42:25 GMT+0530 (India Standard Time)
అన్ని రంగాల్లోనూ ఏపీ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని చెప్పారు. ఇటు అభివృద్ధితో పాటు అటు సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు. పేదలకు అన్ని విధాలుగా చేయూత నివ్వడమే ఈ ప్రభుత్వం ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.
వైఎస్సార్ లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు...
20 మందికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డులను జగన్ ప్రదానం చేయనున్నారు. వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈ అవార్డులను ఇస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే థ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వైఎస్సార్ ను ప్రతి ఏడాది గుర్తుంచుకునేలా ఈ లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డులను ఏర్పాటు చేసుకున్నామన్నారు. వివిధ రంగాల్లో నిపుణులను ఈ సందర్భంగా సన్మానించుకోవడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో పాటు అధికారులు, జగన్ తల్లి విజయమ్మ పాల్గొన్నారు.
Next Story

