Fri Dec 05 2025 14:13:54 GMT+0000 (Coordinated Universal Time)
అంబేద్కర్‌కు ఘన నివాళులు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్‌కు ముఖ్యమంత్రి జగన్ ఘనంగా నివాళులర్పించారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్‌కు ముఖ్యమంత్రి జగన్ ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రాజ్యాంగం అనుసరించే పేదల పక్షాన ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్క రాజకీయ నేతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
ఆయన మార్గంలో...
అంబేద్కర్ సూచించిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయాలను, ఆకాంక్షలను నెరవేరేలా అందరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు లు పాల్గొన్నారు.
Next Story

