Sun Mar 15 2026 14:25:11 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు మూడు నియోజకవర్గాల్లో జగన్ పర్యటన
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జగన్ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ విడుదలయింది. నేడు వై ఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని మూడు జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఆయన నేడు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నేడు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈరోజు కలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మూడు జిల్లాల్లో...
ఈరోజు ఉదయం 10 గంటలకు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కర్నూలు నగరంలో జరిగే జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కళ్యాణ దుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్ లో జరిగే సభ లో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట నియోజకవర్గంలో రైల్వే కోడూరు రోడ్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
Next Story

