Sat Mar 07 2026 12:43:07 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు పుట్టపర్తికి వైఎస్ జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు. వైఎస్సార్ రైతు భరోసా, పిఎం కిసాన్ పథకం నిధులను ఈరోజు విడుదల చేయనున్నారు. రైతు భరోసా కింద ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జగన్ జమ చేయనున్నారు. ఈ పథకం కింద మొత్తం 53.53 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు.
రైతు భరోసా నిధులను...
వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ముందు ఆయన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఏపీలోనూ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో విపక్షాలపై మరోసారి జగన్ విరుచుకుపడే అవకాశముంది. చంద్రబాబు కేసుల విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించనున్నారు. దీంతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేసే ఛాన్స్ ఉంది
Next Story

