Sat Mar 21 2026 09:34:36 GMT+0530 (India Standard Time)
ఎల్లుండి పాయకరాపుపేటకు జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లుండి పాయకరావుపేట రానున్నారు. వివాహానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లుండి పాయకరావుపేట రానున్నారు. అక్కడ వైసీపీ నేత కుమార్తె వివాహానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎల్లుండి ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి జగన్ తునికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పాయకరావుపేటకు వెళతారు.
వివాహానికి హాజరై...
పాయకరావుపేటలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ అమ్మాజీ కుమార్తె వివాహానికి హాజరవుతారు. వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి తుని చేరుకుంటారు. అక్కడ కాకినాడ జిల్లా నేతలతో సమావేశమయి పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు. అనంతరం తుని బయలుదేరి తాడేపల్లికి బయలుదేరి వెళతారు.
Next Story

