Sun Mar 15 2026 00:37:18 GMT+0530 (India Standard Time)
రేపు గవర్నర్ తో జగన్ భేటీ
రేపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు.

రేపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. మర్యాదపూర్వక భేటీ అని సీఎంవో కార్యాలయం చెబుతుంది. అయితే ఉగాది శుభాకాంక్షలు తెలిపేందుకు జగన్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. దీంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు గురించి గవర్నర్ కు జగన్ వివరించనున్నారు. కొత్త జిల్లాల కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీనిని గవర్నర్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది.
విస్తరణపై కూడా......
దీంతో పాటు వచ్చే నెల 11వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. మంత్రివర్గ విస్తరణపై కూడా జగన్ గవర్నర్ తో చర్చించే అవకాశాలున్నాయి. దాదాపు పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ కావడంతో రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేయించాలా? లేక బయట ఏర్పాటు చేయాలా? అన్న దానిపై కూడా గవర్నర్ భేటీలో రేపు స్పష్టత వచ్చే అవకాశముంది.
Next Story

