Sat Mar 07 2026 20:42:34 GMT+0530 (India Standard Time)
Ys Jagan : బస్సు ప్రమాద బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తాం
బస్సుప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బస్సుప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్న జగన్ హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనలో బాధితులను ఆదుకుంటామని తెలిపారు.
క్షతగాత్రులకు...
మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి మెరుగైన చికత్స అందించాలని కోరారు. చిలకలూరి పేట సమీపంలోని పసుమర్రులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
Next Story

