Tue Jan 14 2025 18:54:43 GMT+0000 (Coordinated Universal Time)
నాన్ సీరియస్ నేతలపై జగన్ సీరియస్
పార్టీలో అలసత్వం వహించే నేతలపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది
పార్టీలో అలసత్వం వహించే నేతలపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమానికి డుమ్మా కొట్టారని నివేదికలు సమావేశంలో బయటపెట్టినట్లు సమాచారం. నేతలు నాన్ సీరియస్ గా ఉన్నారని ఆయన ఆగ్రహం చెందినట్లు సమాచారం. గడప గడపకు ప్రభుత్వంపై జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్ ఛార్జులు కూడా హాజరయ్యారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని వారి పేర్లను సమావేశంలో వెల్లడించడం సరికాదని, రెండోసారి ఇదే తరహాగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని జగన్ హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నెలకు 20 రోజులు....
గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించామని, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించేలా కృషి చేయాలని జగన్ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా ప్రజలందరికీ వివిధ పథకాలతో మేలు చేశామని, అందుకని కాలరెగరేసుకుని తిరగాలని జగన్ అన్నారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు చేరాయన్న జగన్, ప్రతి గ్రామ సచివాలయంలో ఖచ్చితంగా రెండు రోజులు గడప గడపకు ప్రభుత్వం కార్కక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి నెలలో పది సచివాలయాల్లో నిర్వహించేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకూ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందేనని జగన్ గట్టిగా చెప్పారు. నెలకు ఇరవై రోజులు ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందేనని చెప్పారు.
Next Story