Sat Mar 07 2026 15:55:45 GMT+0530 (India Standard Time)
నేడు నంద్యాలకు సీఎం జగన్
నేడు ముఖ్యమంత్రి జగన్ నంద్యాల జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ఆళ్లగడ్డలో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొంటారు

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నంద్యాల జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ఆళ్లగడ్డలో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొంటారు. నాలుగో విడత నిధులను లబ్దిదారుల ఖాతాల్లో విడుదల చేయనున్నారు. ఉదయం 9 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు ఆళ్లగడ్డకు చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు. ఈ పథకం కింద 50.92 లక్షల మంది లబ్ది పొందనున్నారు.
బహిరంగ సభలో...
ఇందుకోసం ప్రభుత్వం 25,971 కోట్ల నిధులను విడుదల చేయనుంది. పీఎం వైఎస్సార్ రైతు భరోసా కింద ఈ నిధులను జగన్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. తిరిగి 2.15 గంటలకు తాడేపల్లి కార్యాలయానికి జగన్ చేరుకుంటారు.
Next Story

