Tue Mar 17 2026 08:43:39 GMT+0530 (India Standard Time)
హైకోర్టు తీర్పుపై జగన్ హైలెవెల్ మీటింగ్
రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్నారు

రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్నారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో న్యాయనిపుణులు, ఉన్నతాధికారులతో జగన్ చర్చించనున్నారు. మూడు రాజధానుల బిల్లులను కొత్త రూపంలో అసెంబ్లీకి తీసుకు వస్తామని జగన్ ప్రకటన నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఇబ్బందికరంగా మారింది.
కొత్త బిల్లును.....
కొత్త బిల్లు తెచ్చే అవకాశాలు ఏమేరకు ఉన్నాయి? ప్రస్తుత హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలా? అన్న దానిపై జగన్ న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. మూడు రాజధానుల అంశానికి తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని వైసీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై జగన్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.
Next Story

