Tue Mar 24 2026 18:06:22 GMT+0530 (India Standard Time)
జగన్ ఆదేశాలతో అధికారులు....?
ఆంధ్రప్రదేశ్ లో రహదారుల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ లో రహదారుల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరుకల్లా టెండర్లు పూర్తి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 8,268 కిలోమీటర్ల మేరకు రోడ్ల మరమ్మత్తులు చేయాలని జగన్ ఆదేశించారు. తొలుత రహదారులపై గుంతలు పూడ్చాలని, ఆ తర్వాత మరమ్మతు పనులను చేపట్టాలని జగన్ అధికారులకు సూచించారు.
బ్లాక్ లిస్ట్ లో పెట్టండి....
ఇందుకు అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు జగన్ తెలిపారు. 2022 జూన్ నాటికి రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు, నిర్మాణపనులు పూర్తి కావాలని జగన్ ఆదేశించారు. టెండర్లు దక్కించుకుని పనులను ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని జగన్ ఆదేశించారు.
Next Story

