Sat Dec 06 2025 01:05:11 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నాకు పాలమూరు జిల్లాలో ఎవరూ శత్రువులు లేరు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనకు శత్రువులు ఎవరూ లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనకు శత్రువులు ఎవరూ లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు కొడంగల్లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... మారుమూల కొడంగల్ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. మన దెబ్బకు కేసీఆర్ ఫామ్హౌస్లో పడుకోకుండా ప్రజల్లోకి వెళుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు.డీకే అరుణ మనకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నారని, డబుల్ రోడ్డు వేయలేదని, మక్తల్ ఎత్తిపోతలకు అడ్డుపడ్డారని విమర్శించారు.
సంతకం పెట్టే స్థితిలో...
రానున్న అయిదేళ్లు పాలమూరు ప్రజలు అండగా నిలబడితే అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మనం సంతకం పెట్టే స్థితిలో ఉన్నామన్నారు. పార్టీలను, జెండాలను పక్కన పెట్టి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. పాలమూరుకు ముఖ్యమంత్రి పదవి లేకలేక వచ్చిన అవకాశమని, వందేళ్లయినా మళ్లీ ఇలాంటి అవకాశం రాదని, కాబట్టి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దొంగ దెబ్బ తీయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.
Next Story

