Mon Mar 16 2026 10:12:50 GMT+0530 (India Standard Time)
బిషప్ తుమ్మ బాల కు రేవంత్ ఘన నివాళులు
వరంగల్ బిషప్ తుమ్మ బాల కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు

వరంగల్ బిషప్ తుమ్మ బాల కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఎన్నికలకు ముందు కూడా తాను ఆయన వద్దకు వెళ్లానని, ప్రార్థనలు చేసి మంచి పాలన రావాలని కోరుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
ఘనంగా నివాళులు...
తుమ్మ బాల నిన్న మరణించారు. ఆయన పార్థీవ దేహంపై పుష్పగుచ్ఛముంచి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గురువారం ఉదయం 10.25 గంటలకు డియోసిస్ బిషప్ మోస్ట్ రెవ. తుమ్మ బాల మృతి చెందారు. ఆయన మృతితో ఒక సున్నిత, మంచి వ్యక్తిని కోల్పోయినట్లయిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
Next Story

