Thu Mar 19 2026 07:22:13 GMT+0530 (India Standard Time)
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వైఎస్ జగన్ తెలియజేశారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.
తెలుగు వారందరికీ...
అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికీ 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిలషించారు. ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు.
Next Story

