Tue Dec 16 2025 04:45:00 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. నేడు పలు శాఖలతో చంద్రబాబు సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2.30 గంటలకు సచివాలయానికి రానున్నారు. తొలుత ఈఈఎస్ఎల్ ప్రతినిధులతో సమీక్షను ఆయన నిర్వహిస్తారు.
మున్సిపల్ శాఖపై సమీక్ష...
అనంతరం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖపై సమీక్షను చేస్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డయేరియా సమస్యలు తలెత్తినందున రక్షిత మంచినీటి సరఫరా పథకంపై ఆయన సమీక్షించనున్నారు. ప్రజలకు మంచినీరు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. తర్వాత స్పోర్ట్స్ పాలసీపై అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం హడ్కో ఛైర్మన్ తో సమావేశమవుతారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆయనతో చర్చలు జరుపుతారు.
Next Story

