Fri Jan 30 2026 02:01:55 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు కీలక నిర్ణయం.. ఇకపై వారితో సమావేశం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీ విజయానికి ముఖ్య కారకులైన కార్యకర్తలను విస్మరించకూడదని భావిస్తున్న చంద్రబాబు వారితో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని సిద్ధమయ్యారు. పార్టీ క్యాడర్ ను విస్మరిస్తే రాజకీయంగా భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల ప్రచారంలోనూ...
ఎన్నికల ప్రచారంలోనూ తాను అధికారంలోకి వచ్చినా కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉంటానని, వారి సమస్యలను వింటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రు ఈరోజు సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళతారు. పార్టీ నేతలు, కార్యకర్తలను కలవనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

