Thu Mar 19 2026 09:47:46 GMT+0530 (India Standard Time)
ఎల్లుండి గుంటూరుకు జగన్
ముఖ్యమంత్రి జగన్ కొత్త ఏడాది ప్రారంభంరోజున గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు

ముఖ్యమంత్రి జగన్ కొత్త ఏడాది ప్రారంభంరోజున గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్తిపాడులో జరిగే కార్యక్రమంలో జనవరి 1న ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎం కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. బహిరంగ సభ కూడా ఉండటంతో అధికారులు త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.
బహిరంగ సభలో....
పింఛను మొత్తాన్ని 2,500 రూపాయలకు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది. ఆ సందర్భంగానే బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాను పాదయాత్ర లో చెప్పినట్లుగానే ప్రతి ఏడాది రెండువందల యాభై రూపాయల మేరకు పింఛను పెంచుతున్నట్లు జగన్ ఇప్పటికే చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగిస్తారు.
Next Story

