Tue Mar 31 2026 20:16:57 GMT+0530 (India Standard Time)
మరిన్ని కఠిన చర్యల దిశగా?
కోవిడ్ నియంత్రణపై నేడు ముఖ్యమంత్రి జగన్ సమీక్షించనున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జగన్ సమీక్ష చేయనున్నారు.

కోవిడ్ నియంత్రణపై నేడు ముఖ్యమంత్రి జగన్ సమీక్షించనున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జగన్ సమీక్ష చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజుకు ఆరువేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లో కోవిడ్ వ్యాప్తి అధికంగానే ఉంది. అందుకే ప్రభుత్వం మరోసారి నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ వరకూ నైట్ కర్ఫ్యూ ను పొడిగించింది.
కోవిడ్ నియంత్రణపై.....
కోవిడ్ నియంత్రణపై మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎక్కువ కేసులు ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాపార సముదాయాలు, సినిమాహాళ్లలో జనం రద్దీని తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఈరోజు చేయబోయే సమీక్షలో కోవిడ్ నియంత్రణకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Next Story

