Sun Mar 15 2026 17:42:59 GMT+0530 (India Standard Time)
జగన్ కాళ్ల మీద ఒక్కసారిగా పడటంతో... నివ్వెరపోయిన అధికారులు
ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లాలో నేడు పర్యటించారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు వివాహానికి హాజరయ్యారు.

ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లాలో నేడు పర్యటించారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు వివాహానికి హాజరయ్యారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ముఖ్యమంత్రి జగన్ వివాహ వేడుకలలో పాల్గొనే సమయంలో ఒక దివ్యాంగురాలు వేదిక వెనక వైపు నుంచి వచ్చి కాళ్ల మీద పడ్డారు. తన సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఎలా వచ్చారన్న దానిపై.....?
దీంతో అక్కడ ఉన్న అధికారులు నివ్వెరపోయారు. అసలు ఆ యువతి జగన్ కు అతి సమీపంలోకి ఎలా వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆ యువతి సమస్య విని జగన్ సానుకూలంగానే స్పందించారు. అయినా ఆ యువతి వేదిక వెనుక వైపు నుంచి రావడాన్ని భద్రతాలోపంగానే భావిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Next Story

