Thu Jan 29 2026 04:30:46 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ అంతటా అమూల్ అమలు
త్వరలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అమూల్ కంపెనీ పాల సేకరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

త్వరలో అన్ని ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అమూల్ కంపెనీ పాల సేకరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో పాలవెల్లువ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. పాలను సేకరించే వాళ్లు ధరలను నిర్ణయించడం అన్యాయమని జగన్ అభిప్రాయపడ్డారు. అమ్మేవాళ్లు తక్కువ కొనేవాళ్లు ఎక్కువ మంది ఉండటంతోనే వారు చెప్పిన రేటుకు విక్రయించాల్సి వస్తుందని తెలిపారు.
మంచి ధరకు...
ప్రస్తుతం అమూల్ ద్వారా ఐదు జిల్లాల్లో పాల సేకరణ జరుగుతుందని, కృష్ణా జిల్లాలో ప్రారంభించడంతో ఆరు జిల్లాలకు అమూల్ పాల సేకరణ జరిగిందన్నారు. మిగిలిన ఏడు జిల్లాల్లోనూ త్వరలోనే పాల సేకరణను అమూల్ ద్వారా ప్రారంభిస్తామని జగన్ వెల్లడించారు. రైతులకు, మహిళలకు మంచి ధర లభించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని జగన్ తెలిపారు.
Next Story

