Tue Jan 14 2025 02:31:21 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ తో ముఖ్యమంత్రి జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ తో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ చర్చిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ తో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలను ఆయన గవర్నర్ కు వివరించనున్నారని తెలిసింది. కాకినాడులో ఎమ్మెల్సీ అనంతబాబు హత్య వ్యవహారంతో పాటు, కోనసీమలో అల్లర్లు మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు దహనం వంటి అంశాలను ఆయను గవర్నర్ కు వివరించనున్నారని తెలిసింది.
ఢిల్లీ పరిణామాలను....
ఈ నెల 9వ తేదీన అమరావతిలో టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ముఖ్యమంత్రి దంపతులు ఆహ్వానించనున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ పర్యటన వివరాలను కూడా గవర్నర్ కు వివరించే అవకాశముంది. ముఖ్యమంత్రి జగన్ తో పాటు గవర్నర్ ను ఆయన సతీమణి భారతి కూడా కలిశారు.
Next Story