Fri Dec 05 2025 22:08:30 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఎమెర్జెన్సీ సమావేశం.. వారికి ఆదేశాలు
రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో అత్యవసర సమీక్ష చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో అత్యవసర సమీక్ష చేశారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుంటూ విపత్తు సహాయ కార్యక్రమాలను చేపట్టాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి వెంటనే వెయ్యి రూపాయలు చెల్లించాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు.
తిరుపతిలో....
చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమయింది. ఈ మూడు జిల్లాలకు జగన్ ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జగన్ అధికారులను కోరారు. తిరుపతి పరిస్థితిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశించారు.
Next Story

