Tue Mar 17 2026 15:40:54 GMT+0530 (India Standard Time)
ప్రధాని మోదీకి జగన్ మరో లేఖ
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. బడ్జెట్ ఏపీకి నిధుల కేటాయింపు పై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. బడ్జెట్ ఏపీకి నిధుల కేటాయింపు పై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో జరిగిన కేటాయింపులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జగన్ మోదీకి లేఖ రాశారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని పేర్కొన్నారు.
పోలవరంతో పాటు...
పోలవరం ప్రాజెక్టుకు నిధులతో పాటు, రెవెన్యూలోటు వంటి అంశాలకు పరిష్కారం చూపాలని జగన్ మోదీని తన లేఖలో కోరారు.
దీంతో పాటు ఐఏఎస్ అధికారులను కేంద్రానికి డిప్యూటేషన్ పంపించే అంశంపై కేంద్రం తీసుకువస్తున్న సవరణలను కూడా లేఖలో జగన్ ప్రస్తావించారు. రాష్ట్రాల నుంచి నో అబ్జెక్షన్ లేఖలు వచ్చిన తర్వాత డిప్యూటేషన్ ఖరారవుతున్న ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని జగన్ లేఖలో కోరారు.
Next Story

