Sun Mar 15 2026 23:14:06 GMT+0530 (India Standard Time)
నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు
తమిళనాడు నుంచి తనకు రావాల్సిన డబ్బులను ముఖ్యమంత్రి జగన్ నిలిపివేయించారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు.

తమిళనాడు నుంచి తనకు రావాల్సిన డబ్బులను ముఖ్యమంత్రి జగన్ నిలిపివేయించారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. తనను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి వైసీపీ ప్రభుత్వ పెద్దలు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. తనపై అనర్హత వేటు వేయించలేమని అంగీకరిస్తే వెంటనే తాను ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రఘురామ కృష్ణరాజు ప్రకటించారు.
క్షమాపణ చెప్పాలి....
మంత్రి పేర్ని నాని వెంటనే మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చిరంజీవిపై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని రఘురామ కృష్ణరాజు అన్నారు. ఏపీ సీఐడీ తనపై వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకోవాలని తాను ఇప్పటికే లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రభుత్వం విధి అని ఆయన అన్నారు.
Next Story

