Tue Mar 31 2026 18:35:41 GMT+0530 (India Standard Time)
ఆ విద్యార్థి కుటుంబానికి జగన్ ఆర్థిక సాయం
పాము కాటుకు గురై మరణించిన విద్యార్థి కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక సాయం ప్రకటించారు

పాము కాటుకు గురై మరణించిన విద్యార్థి కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుని కుటుంబానికి ఐదు లక్షల పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. నేడు మంత్రులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయాన్ని అందచేయనున్నారు. విజయనగరం జిల్లా కురుపాంలోని బాలుర బీసీ హాస్టల్ లో పాముకాటుకు గురై ఒక విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరో ఇద్దరు....
బాలుర హాస్టల్ నిద్రిస్తుండగా పాము కాటుకు గురైన ముగ్గురు విద్యార్థుల్లో రంజిత్ అనే విద్యార్థి మరణించగా, నవీన్, వంశీలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్ లో వసతులు మరింత మెరుగు పర్చాలని, పాములు చొరపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story

