Tue Mar 31 2026 18:34:43 GMT+0530 (India Standard Time)
మాండూస్ తుపాన్.. అలర్టయిన ఏపీ సర్కార్
మాండూస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

మాండూస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తుపాను పై ఆయన సమీక్ష నిర్వహించారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా నిరోధించాలని కోరారు. అలాగే రైతుల్లో కూడా ఈ తుపాను పట్ల అవగాహన కల్పించాలని జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
అన్ని శాఖల సమన్వయంతో..
మెండూస్ తుపాను కారణంగా ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా దెబ్బతిన్నా వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పురాతన ఇళ్లను గుర్తించి వారిని ఖాళీ చేయించి అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని జగన్ ఆదేశించారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
Next Story

