Thu Mar 19 2026 10:03:49 GMT+0530 (India Standard Time)
మూడో రోజు చంద్రబాబు దావోస్ లో పర్యటన
దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం మూడోరోజు పర్యటన చేస్తుంది

దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం మూడోరోజు పర్యటన చేస్తుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మూడో రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బేటీ కానున్నారు.
గ్రీన్ కోతో ఒప్పందం...
బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ నేడు సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో ఎంవోయూ కుదుర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్ – పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. ఏపీలో పెట్టుబడులకు వున్న అవకాశాలను చంద్రబాబు వివరించనున్నారు.
Next Story

