Sun Mar 15 2026 16:05:11 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు చంద్రబాబు కీలక సమావేశం
ఈరోజు ఉదయం11గంటలకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

ఈరోజు ఉదయం11గంటలకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. టిడిపి ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు సమావేశం హాట్ హాట్ గా సాగనుంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు ఈ సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఎమ్మెల్యేలతో...
పార్టీ బలోపేతంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తీరు పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉండటం, మరి కొన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తడం, మరికొన్ని నియోజకవర్గాల్లో నామినేటెడ్ పోస్టుల కోసం పేర్లు సిఫార్సు చేయని ఎమ్మెల్యేలు తదితర అంశాలపై చంద్రబాబు నాయుడు నేడు వారితో చర్చించనున్నారు.
Next Story

