Thu Dec 11 2025 00:55:30 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరు విమానాశ్రయాన్ని సందర్శించిన చంద్రబాబు
బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు

బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. కొత్తగా అభివృద్ధి చేసిన టెర్మినల్ 2ను సందర్శించిన సీఎం చంద్రబాబు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. విమానాశ్రయంలోని సౌకర్యాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు వివరించారు. రానున్న రోజుల్లో ఏపీలో ప్రపంచస్థాయి విమానాశ్రయాల అభివృద్ధి చేస్తామని తెలిపారు.
అత్యాధునిక సౌకర్యాలతో...
టెర్మినల్ 2 అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయటం ఆకట్టుకుందని చంద్రబాబు అన్నారు. విమానాశ్రయంలో సహజ ఉద్యానవనాన్ని ఏకీకృతం చేయడం బాగుందని చంద్రబాబు ప్రశంసించారు. విమానాశ్రయంలోని కార్యాచరణ అంశాలు, ఇతర సౌకర్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. రాజధాని అమరావతిలోనూ అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో విమానశ్రయాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
Next Story

