Fri Dec 05 2025 09:22:40 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : వచ్చే నెలలోనే చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ
వచ్చే నెలలోనే అమరావతిలో చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు

రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వచ్చే నెల 9న భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. గత ఏడాది ఆఖరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఈ6 రోడ్డుకు ఆనుకుని ఐదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఇంటి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు కేవలం రెండు దూరంలోనే ఈ స్థలం ఉంది. అమరావతి పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
అమరావతిలో ఐదు ఎకరాల్లో...
ఇంటి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఉద్యానం, రక్షణ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్, తదితర అవసరాలను కూడా నిర్మాణంలో పరిగణనలోకి తీసుకుని నిర్మాణ పనులు చేపడతారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న తలంపుతో ముఖ్యమంత్రి ఉన్నారు. సన్నాహక చర్యల్లో భాగంగా శుక్రవారం మంత్రి లోకేశ్ కార్యాలయ సిబ్బంది, వాస్తు సిద్ధాంతి వచ్చి స్థలాన్ని పరిశీలించారు. చదును చేసే పనులను కూడా ప్రారంభించారు. ఈ స్థలాన్ని నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు తెలిసింది.
Next Story

