Tue Mar 24 2026 12:03:52 GMT+0530 (India Standard Time)
Chandrababu : ఢిల్లీలో జగన్ ధర్నాను పట్టించుకోవాల్సిన అవసరం లేదు
ఢిల్లీలో జగన్ ధర్నాను గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

ఢిల్లీలో జగన్ ధర్నాను గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీీపీ ఏం చేస్తున్నదన్న విషయం పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకుని కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు వచ్చేలా చూడాలని కోరారు.
మంత్రులను వెంటబెట్టుకుని...
అవసరమైతే మంత్రులను వెంటబెట్టుకుని ఢిల్లీలో కేంద్రమంత్రులను కలసి వారికి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు ఇవ్వాలని కోరారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి రాష్ట్రానికి దక్కాల్సిన నిధులను వీలయినంత త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. కేంద్ర నిధులను వీలయినంత ఎక్కువగా తీసుకు వచ్చేలా ఎంపీలు, మంత్రులు పనిచేయాలని కోరారు.
Next Story

