Mon Dec 08 2025 10:02:31 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అందుకే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోతున్నాం
గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని విష వలయంలోకి నెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని విష వలయంలోకి నెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్రం నిధులను ఇస్తేనే ఇప్పుడు పనులన్నీ పూర్తవుతాయని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టడం కూడా కష్టంగా కూడా మారిందని చంద్రబాబు అన్నారు. ఆర్ధికపరిస్థితి బాగాలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని అన్నారు. తాను గతంలో చెప్పినట్లు శ్రీలంకలా ఏపీని తయారు చేశానని, అందులో నిజమవుతుందని అన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలంటే అందుకే ఆలోచించాల్సి వస్తుందని అన్నారు. అయినా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, ఇచ్చిన తేదీల ప్రకారం వాటిని అమలు చేశామని చంద్రబాబు తెలిపారు.
అన్నీ అప్పులే...
గత ప్రభుత్వం కార్పొరేషన్లపై కూడా అప్పులు తెచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ ఐదేళ్లలో రహదారుల నిర్వహణ కూడా సరిగా లేకపోవడంతో గుంతలు పడ్డి అస్తవ్యస్థంగా మారాయని చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు శ్వేత పత్రాలు ఇచ్చామని తెలిపారు.కేంద్రం నుంచి మనం సాయం తీసుకుంటేనే గట్టెక్కగలమని చంద్రబాబు అన్నారు. తెచ్చిన అప్పులను ఇష్టానుసారం ఖర్చు చేయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధిపై పెట్టకుండా ఇతర పనులపై పెట్టడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి అభివృద్ధి పనులపై దృష్టి సారించామని తెలిపారు. కేంద్రం ఇతర రాష్ట్రాలకు కూడాసాయం చేయాల్సి ఉన్నందున దానిపై ఒత్తిడి తేవడం సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Next Story

