Fri Dec 05 2025 13:51:21 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఏమన్నారంటే?
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశఆరు. ప్రశాంతి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, వైసీపీ నేతల తీరులో మార్పు రావడం లేదని, మహిళలను దూషించడం, బూతులు తిట్టడం, కించపరచడం అనేది ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుందని చంద్రబాబు అన్నారు. మహిళలను అవమానపరచడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉందని చంద్రబాబు తెలిపారు.
కఠిన చర్యలు తప్పవంటూ...
వారి ఘోర ఓటమికి ఇలాంటి పోకడలు ఒక కారణమని తెలిసినా వారి సహజ గుణంలో మార్పు రావడం లేదని, చెల్లి పుట్టుకపైనా వ్యాఖ్యలు చేసిన వారి నాయకత్వంలో పనిచేస్తోన్న నేతలు అంతే దారుణంగా, అసహ్యంగా మాట్లాడుతూ వారి నీచ సంస్కృతిని చాటుకుంటున్నారన్నారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వీరు మనుషులేనా? ఇది రాజకీయమా? మహిళల, మహిళానాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, ప్రణాళికాబద్దంగా వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రతి పౌరుడు గమనించాలని చంద్రబాబు కోరారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠినచర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు.
Next Story

