Mon Jan 19 2026 22:08:51 GMT+0000 (Coordinated Universal Time)
వరద పాపం గత పాలకులదే : చంద్రబాబు
గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఇంతటి విపత్తు సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఇంతటి విపత్తు సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంతటి విపత్తును చూడలేదన్నారు. తాను ఇక్కడకు దగ్గరలోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తానని తెలిపారు. బాధితులకు అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. గంట గంటకు తాను పరిస్థితిని సమీక్షిస్తానని తెలిపారు.
వరద ప్రాంతంలో...
విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సహాయ చర్యలను అడిగి ప్రశ్నించారు. అందరినీ కాపాడుకుంటామని ప్రాణ నష్టం లేకుండా తాము అన్ని చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు.
Next Story

