Wed Mar 25 2026 16:51:37 GMT+0530 (India Standard Time)
Chandrababu : మరో జన్మ ఉంటే తెలుగు జాతిలోనే పుడతా
యువతకు ఇటీవల కాలంలో ఎక్కువ అవకాశాలు ఇస్తున్నానని, వారయితేనే అవకాశాలను అందిపుచ్చుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

యువతకు తాను ఇటీవల కాలంలో ఎక్కువ అవకాశాలు ఇస్తున్నానని, వారయితేనే అవకాశాలను అందిపుచ్చుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జూరిక్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు మాట్లాడారు. యూరప్ లో బోలెడన్ని అవకాశాలున్నాయని తెలిపారు. రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్లే పారిశ్రామిక రంగంలో కూడా అవకాశాలు అందిపుచ్చుకోవాలని అన్నారు. తాను జైలులో ఉన్న యాభై మూడు రోజులు ఇతర దేశాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఏపీకి వచ్చి ఓటర్లను చైతన్యపర్చారని చంద్రబాబు అన్నారు.
జన్మలో మర్చిపోలేను...
కూటమి తరుపున పోటీ చేస్తే డబ్బులు ఖర్చు చేసి మరీ గెలిపించారంటే జన్మలో మరిచిపోనని, మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు జాతిలోనే పుట్టాలని కోరుకుంటానని చంద్రబాబు అన్నారు. ఐటీకి తాను ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఏపీ పరిస్థితుల్లో ఇతర దేశాల్లో ఉండే వాళ్లు అభివృద్ధికి ఊతమివ్వాలని కోరారు. మహిళలు పురుషులకంటే తెలివైన వారన్నారు. ప్రపంచంలోనే జనాభా సమస్య వచ్చిందన్నారు. పిల్లల్ని కనాలని కోరుతున్నానని చెప్పారు. తెలుగు వాళ్లంతా ప్రపంచ వ్యాప్తంగా ఉండాలని, అదే సమయంలో జన్మభూమికి సహకరించాలని చంద్రబాబు కోరారు.
Next Story

