Thu Mar 20 2025 01:27:26 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : దావోస్ లో నవ్వులు పూయించిన చంద్రబాబు
దావోస్ లో అన్ని రాష్ట్రాలూ పెట్టుబడుల కోసం పోటీ పడుతూనే పరస్పరం ప్రోత్సహించుకుంటున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఇండియా నుంచి పాల్గొంటున్న రాష్ట్రాలన్నీ పెట్టుబడుల కోసం పోటీ పడుతూనే పరస్పరం ప్రోత్సహించుకుంటున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విభిన్నమైన రాజకీయ విధానాలు, ఆకాంక్షలు ఉన్నా ఒకటిగా కలసి పని చేస్తామని చంద్రబాబు ఈసందర్భంగా తెలిపారు.
ఈ రెండు రాష్ట్రాలు...
అయితే తెలంగాణ ను ఉద్దేశించి చంద్రబాబు ఫన్నీ కామెంట్స్ చేశారు. "వాళ్లు రిచ్.. మేము పూర్" ఆయన చేసిన వ్యాఖ్యలతో అందరూ ఒక్కసారిగా నవ్వారు.తెలంగాణ స్టేట్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ఇండియా అని చంద్రబాబు ఈ సందర్భంగా దావోస్ లో తెలిపారు. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటూ చంద్రబాబు అన్నారు. ఆయన పక్కన తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవిస్ లు ఉండి నవ్వడం కనిపించింది.
Next Story