Thu Mar 19 2026 04:09:43 GMT+0530 (India Standard Time)
7న పోలవరానికి సీఎం చంద్రబాబు
ఈ నెల 7వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు.

ఈ నెల 7వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. అనంతరం ప్రాజెక్ట్ ను ఏరియల్ సర్వే చేయనున్నారు. ప్రాజెక్ట్ పనులను స్వయంగా పరిశీలించిన అనంతరం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
అధికారులతో సమీక్ష...
వచ్చే ఏడాది పోలవరం నుంచి నీరు ఇస్తామని చెప్పడంతో పనుల పురోగతిపై చంద్రబాబు అక్కడకు వెళ్లి సమీక్ష చేయనున్నారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు సైట్ నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు ఉండవల్లి నివాసంకు చేరుకోనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ పీబీ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వార్షికోత్సవ వేడుకలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు .
Next Story

