Thu Mar 19 2026 04:44:56 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు మూడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని మురళీ ఫార్చ్యూనర్ హోటల్లో జరిగే జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు గుంటూరు బయలుదేరి వెళతారు.
ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో...
మధ్యాహ్నం మూడు గంటలకు గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ - హ్యాకథాన్ 2025 కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి వెళ్తారు. అక్కడ జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను పరిశీలిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
Next Story

