Fri Dec 05 2025 20:48:13 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు పోలవవరం ప్రాజెక్టుకు చంద్రబాబు
ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు

ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించనున్నారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తానని ప్రకటించిన చంద్రబాబు ఆ ప్రాజెక్టు వద్దకు నేరుగా వెళ్లి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. తన క్షేత్రస్థాయి పర్యటన పోలవరం ప్రాజెక్టుతోనే ప్రారంభమవుతుందని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. పోలవరం త్వరగా పూర్తి చేసి నదుల అనుసంధానం ప్రక్రియను చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.
మిగిలిన పనులను...
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు 79 శాతం పనులు పూర్తి కావడంతో మిగిలిన పనులను కూడా పూర్తి చేసేందుకు చంద్రబాబు ప్రాజెక్టు లో పెండింగ్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమై పనుల పురోగతిపై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు చంద్రబాబు వస్తుండటంతో ప్రాజెక్టు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

