Sat Mar 07 2026 17:33:27 GMT+0530 (India Standard Time)
నేడు అనకాపల్లికి చంద్రబాబు
అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వెళ్లనున్నారు.

అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వెళ్లనున్నారు. ఈ ప్రమాదంలో లో మృతుల సంఖ్య పదిహేడుకు పెరిగింది. అరవై మందికి పైగా గాయపడ్డారు. మందుల తయారీలో ఉపయోగించే రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం వెళ్లి చంద్రబాబు ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకోనున్నారు.
మృతుల కుటుంబాలను...
అనంతరం ఫార్మా కంపెనీలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. గాయపడిన వారిని ఆసుపత్రికి వెళ్లి పరామర్విస్తారు. ఇంత భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరగడంతో ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లి మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం తరుపున నష్టపరిహారం ప్రకటించే అవకాశముంది.
Next Story

