Wed Dec 10 2025 16:57:03 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు సీఆర్డీఏ సమావేశంలో చంద్రబాబు
నేడు సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. నేడు సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 47వ సీఆర్డీఏ అధారిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా హాజరు కానున్నారు.
మరిన్ని పనులకు అనుమతి...
వీరితో పాటు సీఆర్డీఏ అధికారులు కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతి పరిధిలో చేపట్టాల్సిన మరికొన్న పనులకు సీఆర్డీఏ అధారిటీ అనుమతివ్వనుంది. ఇక అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే రాజధాని పనులకు శంకుస్థాపన చేయడంతో పనులు వేగవంతం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించనున్నారు.
Next Story

